విద్యార్థుల‌పై న‌మోదైన కేసుల‌ను తొల‌గించాలి

ఆదేశాలు జారీ చేసిన‌ సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్

hellotelugu-CMVijay

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఢిల్లీ వేదిక‌గా నిర‌స‌న తెలిపిన విద్యార్థుల‌కు పూర్తిగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వారిపై అకార‌ణంగా కేసులు న‌మోదు చేశారంటూ వాపోయారు. నీట్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించు కోవాలని విజయ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా నీట్ ఆందోళ‌న‌లో భాగంగా త‌మిళ‌నాడులో విద్యార్థులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఈసంద‌ర్బంగా ఆయా ప్రాంతాల‌లో ముఖ్యంగా రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో నిర‌స‌న తెలిపిన వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. దీనిపై సీఎం ఇవాళ సీరియ‌స్ గా స్పందించారు. త‌మ స్టాండ్ విద్యార్థుల ప‌క్షమేన‌ని ముందు నుంచి చెబుతూ వ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా త‌క్ష‌ణ‌మే విద్యార్థుల‌పై వివిధ ప్రాంతాల‌లో న‌మోదు చేసిన కేసుల‌ను ఉప‌సంహ‌రించాల‌ని సీఎం ఆదేశించారు.

ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు పాఠశాల విద్యాశాఖ మంత్రి సోషల్ మీడియా పోస్ట్‌లో . నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ చెన్నైలోని సీపీఐ ప్రధాన కార్యాలయం వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతుదారులు నిర‌స‌న చేప‌ట్టారు. నీట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించు కుంటామని తమిళనాడు మంత్రి ఎ. రాజ్‌మోహన్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన కేసులన్నీ తొల‌గిస్తామ‌న్నారు. తదుపరి వివరాలు త్వరలో వెల్లడించడం జ‌రుగుతుంద‌ని చెప్పారు.

Exit mobile version