భోగాపురం విమానాశ్రయం జాప్యానికి జగనే కారణం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేంద్ర మంత్రి పెమ్మ‌సాని

hellotelugu-PemmasaniChndarasekhar

న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆదివారం పెమ్మ‌సాని మీడియాతో మాట్లాడారు. ఉత్త‌రాంధ్ర‌కు త‌ల‌మానికంగా మారిన భోగాపురం ఎయిర్ పోర్టు ఆల‌స్యంగా ప్రారంభం కావడానికి ప్ర‌ధాన కార‌కుడు జ‌గ‌న్ రెడ్డి అని మండిప‌డ్డారు. దీనికి తానే బాధ్య‌త వహించాల్సి ఉంటుంద‌న్నారు. 2019 నాటికే అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 2,200 ఎకరాల భూమిని సేకరించిందని చెప్పారు. అయితే మిగిలిన 500 ఎకరాల సేకరణ మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులు వేసినట్లుగా ఆరోపించ బడుతున్న కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైందని పెమ్మసాని పేర్కొన్నారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు.

2015లో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ . 2,700 ఎకరాల భూమిలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి జీఎంఆర్ అంగీకరించిందనితెలిపారు. 2019 నాటికే అప్పటి టీడీపీ ప్రభుత్వం 2,200 ఎకరాలను సేకరించిందని, మిగిలిన 500 ఎకరాల సేకరణ మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులు వేసినట్లుగా ఆరోపించ బడుతున్న కోర్టు కేసుల వల్ల ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ప్రభుత్వం కొన్ని కేసులను ఉపసంహరించుకుని కేవలం 300 ఎకరాలను మాత్రమే సేకరించిందని పెమ్మసాని చెప్పారు. అవినీతి ఆరోపణలను సాకుగా చూపి జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి రీ-టెండర్ ప్రక్రియను చేపట్టిందని, దీనివల్ల నిర్మాణం మరింత ఆలస్యమైందని ఆయన ఆరోపించారు.

Exit mobile version