VRO-GPO Committee : హైదరాబాద్ : తెలంగాణ (Telangana) వీఆర్ఓ, జీపీఓల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అష్టకష్టాలు పడి విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవిన్యూ కార్యదర్శులకు సరైన సమయంలో జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కమిటీ ప్రతినిధులు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లడంలో తాము ఇతోధికంగా కృషి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి చక్రంలో కీలక భూమిక పోషిస్తున్న తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వాపోయారు. తమ మీద ఆధారపడిన కుటుంబాలు నెల నెలా జీతాలు రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తక్షణమే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
VRO-GPO Committee Demands
ప్రధానంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ప్రజా సేవకు అంకితమై ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నటువంటి గ్రామ పాలన అధికారుల జీతభత్యాలలో జాప్యం జరుగుతుండడం దారుణమన్నారు. హెడ్ ఆఫ్ అకౌంటును నిర్ణయించి క్యాడర్ స్ట్రెంత్ తో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీతభత్యాలు చెల్లించే విధంగా చూడాలని సీఎస్ రామకృష్ణా రావును కోరారు. అంతే కాకుండా జిపిఓల సర్వీస్ రూల్స్ ను వేగవంతంగా తయారుచేసి సమస్యలకు మార్గం చూపాలని, రెవెన్యూ శాఖలో వీఆర్వోలుగా కొనసాగుతున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు.
Also Read : Nara Lokesh Fired on YS Jagan : జగన్ అసెంబ్లీకి రాకుండా ఆరోపణలు చేస్తే ఎలా..?
