Nara Lokesh : అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నిప్పులు చెరిగారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఉద్దేశంచిన సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తానంటూ మరో కొత్త నాటకానికి తెర తీశారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఎవరినీ చంపకుండా ఉంటే చాలు అని అన్నారు నారా లోకేష్. మద్యంలో డబ్బులు తీసుకోవట్లేదని నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. సోమవారం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. మరి మద్యం కుంభకోణం లో డబ్బులు తీసుకోలేదని జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు.
Minister Nara Lokesh Slams YS Jagan
అసెంబ్లీలో జగన్ చర్చకు రాకుండా బయట ఈ డ్రామాలేంటి అంటూ మండిపడ్డారు నారా లోకేష్. చట్టాలు ఉల్లంఘించిన వారిని శిక్షించే విషయంలో కుల, మత, ప్రాంతాలు, పార్టీలు చూడమన్నారు. కల్తీమద్యం పై దాడులు చేసింది కూటమి ప్రభుత్వం, పట్టుకుంది తెలుగుదేశం ముసుగులో ఉన్న నాయకుల్ని అని స్పష్టం చేశారు. జగన్ బీసీల వ్యతిరేకి కాబట్టే అతని పార్టీకి 11సీట్లు వచ్చాయన్నారు. ఆ విషయం గుర్తు పెట్టుకోకుండా ఇలాంటి చవకబారు కామెంట్స్ చేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు నారా లోకేష్. బీసీ యువకుడైన చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం రాకుండా అడ్డు పడింది వైసీపీ కాదా అని నిలదీశారు. అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికారు కాబట్టే జోగి రమేష్ అరెస్టు అయ్యారని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు లోకేష్.
Also Read : Popular Business Man Gift to Women Cricketers : మహిళా క్రికెటర్లకు వజ్రాల ఆభరణాలు
