Pawan Kalyan Important Comments on VC Sajjanar : సీపీ స‌జ్జ‌నార్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంగ్రాట్స్

పైర‌సీ వ‌ల్ల తెలుగు సినిమా రంగానికి న‌ష్టం

Hello Telugu - Pawan Kalyan Important Comments on VC Sajjanar

Hello Telugu - Pawan Kalyan Important Comments on VC Sajjanar

Pawan Kalyan : అమ‌రావ‌తి : సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కి అభినందనలు తెలియ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ (Pawan Kalyan). ఈ పైర‌సీల బాధ త‌న సినిమాల‌ను ఎక్కువ‌గా ప్రభావితం చేసింద‌ని, దీని ద్వారా పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగింద‌ని వాపోయ‌యారు. సోమ‌వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్స్ సామాజిక‌వేద‌క‌గా స్పందించారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

DY CM Pawan Kalyan Praises CP VC Sajjanar

పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించి వేయడం స్వాగతించదగ్గ పరిణామం అని ప్ర‌శంస‌లు కురిపించారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగమైన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌తలు తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు డిప్యూటీ సీఎం. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికి పోతున్నారో చైతన్య పరుస్తున్నారని తెలిపారు. సీపీతో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్ట పోతున్నారో వివరించారని వెల్ల‌డించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకు వచ్చిందన్నారు.

Also Read : Supreme Court Fired on TG Speaker : తెలంగాణ స్పీక‌ర్ ధిక్కారం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

Exit mobile version