న‌వంబ‌ర్ 20న ‘ఆకాశంలో ఒక తార విడుద‌ల’

దుల్క‌ర్ స‌ల్మాన్, రుహాని శ‌ర్మ ముఖ్య పాత్ర‌ల్లో

hellotelugu-RuhaniSharma

హైద‌రాబాద్ : దుల్క‌ర్ స‌ల్మాన్ , రుహానీ శ‌ర్మ కీ రోల్స్ పోషిస్తున్న చిత్రం ఆకాశంలో ఒక తార‌. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. న‌వంబ‌ర్ 20న సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు మూవీ మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. తాజాగా ఓ అంద‌మైన పోస్ట‌ర్ ను పంచుకున్నారు సోష‌ల్ మీడియా వేదిక‌గా. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో ‘బిజిలి’గా పరిచయమైన రుహాని శర్మ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రుహాని సాంప్రదాయ దుస్తుల్లో (మెరూన్ రంగు ప్రింటెడ్ టాప్, చిన్న బిందీతో) కనిపిస్తున్నారు. కిటికీ పక్కన కూర్చుని, ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఆమె రూపం, మృదువైన వెలుతురుతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో ‘బిజిలి’ పాత్ర ఒక కీలక మలుపుగా నిలుస్తుంద‌ని మూవీ మేక‌ర్స్ పేర్కొంటున్నారు.

ఆమె తన జీవితంలోని వ్యక్తులకు వెచ్చదనాన్ని, ఆశ్చర్యాన్ని , సహజమైన ఉత్సాహాన్ని తీసుకువచ్చే పాత్ర. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామా 20న దేశ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా , లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం కానుండగా, శృతి హాసన్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, తన కలలను సాకారం చేసుకునే క్రమంలో కథానాయకుడి సహాయంతో ముందుకు సాగే ఒక ప్రతిష్టాత్మక గ్రామీణ యువతి కథను పరిచయం చేస్తుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు; ప్రొడక్షన్ డిజైన్‌ను శ్వేత సాబు సిరిల్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version