Supreme Court : న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం తెలంగాణకు చెందిన 10 మంది ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాన్చుడు ధోరణి ప్రదర్శించడం, ఆపై తమకు ఇంకా టైం కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం పట్ల మండిపడింది దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కేసుపై సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాదు గవాయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్పీకర్ ను ఉద్దేశించింది. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించడం పట్ల ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇంకెంత టైం కావాలని ప్రశ్నించారు.
Supreme Court of India Slams Telangana Speaker
ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారించింది. గత జూలై 31న అనర్హత పిటిషన్లను మూడు నెలల్లో గా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు. వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లేకుంటే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆదేశించింది. ఆయన తన నూతన సంవత్సరాన్ని ఎక్కడ గడపాలని అనుకుంటున్నారో నిర్ణయించు కోవడం తనకే వదిలి వేస్తున్నామని వ్యాఖ్యానించింది.
Also Read : Delhi Car Blast Person Arrest : ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక వ్యక్తి అరెస్ట్
