AP Mega DSC Results Sensational : ఏపీ మెగా డీఎస్సీ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల

అధికారికంగా ప్ర‌క‌టించిన పాఠశాల విద్యా శాఖ

Hello Telugu - AP Mega DSC Results Sensational

Hello Telugu - AP Mega DSC Results Sensational

AP Mega DSC : అమ‌రావ‌తి – ఏపీ మెగా డీఎస్సీ 2025 ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది ఏపీ పాఠ‌శాల విద్యా శాఖ‌. అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.inలో ఫ‌లితాల‌కు సంబంధించి వివ‌రాలు న‌మోదు చేశామ‌ని తెలిపింది. రాష్ట్రంలోని వివిధ పాఠ‌శాల‌లో 16,347 బోధ‌న‌కు సంబంధంచిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి: స్కూల్ అసిస్టెంట్లు, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్లను ఏపీ డీఎస్సీ మార్కులు 80 శాతం, ఏపీ టెట్, సీటెట‌ట్ ఆధారంగా షార్ట్ లిస్టు చేయ‌నున్నారు. అయితే సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్ల ఎంపిక‌కు సంబంధించి ఒకే ప్ర‌మాణాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది విద్యా శాఖ‌. కాగా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ , ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ల ఎంపిక ఏపీ డీఎస్సీ (AP Mega DSC) మార్కుల ఆధారంగా మాత్ర‌మే (100 శాతం) ఆధార‌ప‌డి ఉంటుంద‌ని పేర్కొంది.

AP Mega DSC Results

అర్హ‌త మార్కుల‌కు సంబంధించి పాఠ‌శాల విద్యా శాఖ ఇప్ప‌టికే మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఏపీ టెట్, సీటెట్ కి క‌నీస అర్హ‌త మార్కులు ఓసీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు 90 మార్కులు రావాలి. బీసీల‌కు 75, ఎస్సీ, ఎస్టీ, పిడ‌బ్ల్యూడీ , మాజీ సైనికుల అభ్య‌ర్థుల‌కు 60 మార్కులు సాధించాల్సి ఉంటుంది. టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ప‌రీక్ష‌ను రాష్ట్ర వ్యాప్తంఆ గ‌త జూన్ 6 నుండి జూలై 6 వ‌ర‌కు నిర్వ‌హించారు. తాత్కాలిక సమాధాన కీలు కూడా వెల్ల‌డించింది ఏపీ విద్యాశాఖ‌. ఏవైనా అభ్యంత‌రాలు ఉన్న‌ట్ల‌యితే పంపించాల‌ని కోరారు. వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కీని త‌యారు చేశారు.

Also Read : Marri Janardhan Reddy Fired on Congress : కాంగ్రెస్ దుష్ప్ర‌చారం మ‌ర్రి ఆగ్రహం

Exit mobile version