Nitin Gadkari Shocking Comments : కావాల‌ని బ‌ద్నాం చేస్తున్నారు : గ‌డ్క‌రీ

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్న కేంద్ర మంత్రి

Hello Telugu - Nitin Gadkari Shocking Comments

Hello Telugu - Nitin Gadkari Shocking Comments

Nitin Gadkari : ముంబై : కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రు కావాల‌ని త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఇందులో భాగంగానే సామాజిక మాధ్య‌మాల‌లో వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయిస్తున్నారంటూ వాపోయారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాను ఏమిటో, త‌న జీవితం ఏమిటో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌న్నారు. త‌మ పార్టీలోని కొంద‌రు కూడా ఇందులో ఉండి ఉండ‌వచ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు గ‌డ్క‌రీ (Nitin Gadkari). పెట్రోల్ పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న‌దంతా పెయిడ్ క్యాంపెయిన్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పెట్రోల్ లో 20 శాతం ఇథ‌నాల్ క‌లుప‌డం , దాని వెనుక తాను ఉన్నాన‌ని, త‌న‌కు చెందిన కంపెనీలు ఉన్నాయంటూ దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు గ‌డ్క‌రీ.

Union Minister Nitin Gadkari Slams

ఇదిలా ఉండ‌గా సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వార్షిక సదస్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ ఎలా ప‌ని చేస్తుందో రాజ‌కీయాలు కూడా అలాగే త‌యార‌య్యాయ‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి. రాజ‌కీయంగా దెబ్బ తీయాల‌నే ఉద్దేశం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. మ‌రోసారి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఇథ‌నాల్ పై. దీని మిశ్ర‌మం కీలకంగా మారబోతోంద‌న్నారు. ఇంధ‌న దిగుమ‌తుల‌కు ఇథ‌నాల్ ప్ర‌త్యామ్నాయంగా ఉంటుంద‌ని, ఖ‌ర్చు త‌క్కువ అవుతుంద‌ని , కాలుష్య ర‌హిత‌మ‌ని పేర్కొన్నారు. ఇది పూర్తిగా స్వ‌దేశీ ప‌రంగా త‌యారు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు నితిన్ గ‌డ్క‌రీ.

Also Read : AP CS Important Meeting : 15,16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ : సీఎస్

Exit mobile version