AP CS Important Meeting : 15,16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ : సీఎస్

కీల‌క అంశాల‌పై చ‌ర్చించేందుకు ఛాన్స్

Hello Telugu - AP CS Important Meeting

Hello Telugu - AP CS Important Meeting

AP CS : అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో భాగంగా ఈనెల 15, 16 తేదీల‌లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో కీల‌క కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తులో రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుందని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం సీఎస్ (AP CS) కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఇదిలా ఉండ‌గా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలు వురు ఐఏఎస్ లు, ఐఎఫ్ఎస్ లు, ఐపీఎస్ లు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించటంతో పాటు కొత్త టీంతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు.

AP CS Key Comments

క‌లెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్న‌ట్లు తెలిపారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (AP CS). రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన జరిగింద‌ని పేర్కొన్నారు.. ఏడాదిన్నర పాలన విధి విధానాల అమలు తీరుపై సీఎం సమీక్షిస్తార‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై కూడా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. ఈసారి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించే ఈ సదస్సులో వచ్చే మూడేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో వస్తున్న ఫిర్యాదులను క్రోఢీకరించి నూరు శాతం సంతృప్తి స్థాయికి చేరే లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు తెలిపారు.

కాగా ప్రతి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ప్రయోజనాలు, జిల్లాల వారీ అవసరాలను గుర్తించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలనే భావనతో సీఎం చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.

Also Read : Annamalai Shocking Comments : ద‌ళ‌పతి విజ‌య్ వీకెండ్ లీడ‌ర్ : అన్నామ‌లై

Exit mobile version