Minister Nara Lokesh Warning : మ‌హిళ‌ల జోలికి వ‌స్తే ఊరుకోను – లోకేష్

రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ నేనున్నా

Hello Telugu - Minister Nara Lokesh Warning

Hello Telugu - Minister Nara Lokesh Warning

Nara Lokesh : అమ‌రావ‌తి – మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు మ‌హిళ‌ల గురించి. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్నంత వ‌ర‌కు ఏ ఒక్క ఆడ బిడ్డ‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు. వారంద‌రూ త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల ప‌ట్ల చుల‌క‌న‌గా చూశార‌ని ఆరోపించారు. వారిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, బ‌ల‌వంత‌పు మ‌ర‌ణాలు జ‌రిగాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు నారా లోకేష్ (Nara Lokesh) . కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. ఎవ‌రు వాళ్ల జోలికి వ‌చ్చినా చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ‌చ్చారు నారా లోకేష్‌.

IT Minister Nara Lokesh Key Comments

రోజు రోజుకు మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచేలా సినిమాలు, వెబ్ సీరీస్ కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయ‌ని వాపోయారు. ఇక నుంచి మహిళలను కించపరిచే డైలాగ్స్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కాకుండా చట్టం తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నారా లోకేష్. మహిళలను గౌరవించడం మన ఇంటిని నుంచి మొదలు కావాల‌ని పిలుపునిచ్చారు. అందుకే పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు చేస్తున్న బొమ్మల్లో 50 శాతం మహిళలు, 50 శాతం పురుషులు ఉండే విధంగా మార్పు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని జ‌గ‌న్ రెడ్డి మహిళల సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు నారా లోకేష్‌. సొంత తల్లిపై కేసు గెలిస్తే సంబరాలు చేసుకున్న చ‌రిత్ర ఎక్క‌డా లేద‌న్నారు. ముందు మీ ఇంట్లో ఉన్న మహిళలకు న్యాయం చేసిన తర్వాతే మా గురించి మాట్లాడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జ‌గన్ రెడ్డికి.

Also Read : Minister Bandi Sanjay Challenge : బీహార్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

Exit mobile version