Minister Bandi Sanjay Challenge : బీహార్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

స్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్

Hello Telugu - Minister Bandi Sanjay Challenge

Hello Telugu - Minister Bandi Sanjay Challenge

Bandi Sanjay : హైద‌రాబాద్ – కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త్వ‌ర‌లో బీహార్ రాష్ట్రంలో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. ప్ర‌తిప‌క్షాలు కావాల‌ని కుట్ర‌లు చేస్తున్నాయ‌ని, అన‌వ‌స‌రంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై, కేంద్రంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాయంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎన్ని కుట్ర‌లు చేసినా, మ‌రెన్ని నిరాధార‌మైన విమ‌ర్శ‌లు చేసినా అక్క‌డ గెలిచేది త‌మేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. వాళ్లు క‌ల‌లు కంటున్నార‌ని, అవి నెర‌వేర‌వ‌ని పేర్కొన్నారు.

Union Minister Bandi Sanjay Key Comments on Bihar Elections

వాస్త‌వానికి ఓట్లు తొలగించే అధికారం మాకు ఉండి ఉంటే 240 సీట్లే ఎందుకు వస్తాయని ప్ర‌శ్నించారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ (Bandi Sanjay). అలా అక్ర‌మాల‌కు పాల్ప‌డి ఉంటే, ఈసీతో త‌ప్పులు చేయించి ఉంటే అన్ని లోక్ స‌భ సీట్లు త‌మ‌కే వ‌చ్చి ఉండేవి క‌దా అని ప్ర‌శ్నించారు. మోదీ స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న‌ను చూసి ప్ర‌తిప‌క్షాలు ఓర్వే లేక పోతున్నాయ‌ని మండిప‌డ్డారు. ఇక‌నైనా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాద‌వ్ లాంటి వారిని ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. దేశంలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ హ‌వా కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఒక్క బీహార్ లోనే కాదు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌ల్లో తామే గెలుస్తామ‌ని రాసి పెట్టుకోవాల‌ని స‌వాల్ విసిరారు. మ‌రో వైపు బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చివ‌ర‌కు నోటాకు ఓటు వేసినా ఆ ఓటు త‌న‌కే ప‌డుతుంద‌న్నారు.

Also Read :  Ambati Rambabu Fired on CM Chandrababu : చంద్ర‌బాబుపై భ‌గ్గుమ‌న్న రాంబాబు

Exit mobile version