MLC Balmoori Venkat Fired on KTR : కేటీఆర్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి : బ‌ల్మూరి

మాజీ మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్సీ

Hello Telugu - MLC Balmoori Venkat Fired on KTR

Hello Telugu - MLC Balmoori Venkat Fired on KTR

MLC Balmoori Venkat : హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ (MLC Balmoori Venkat) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భారత రాష్ట్ర స‌మితి పార్టీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా మీద దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో త‌మ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఆయ‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్టుల‌కు సంబంధించి అన్నీ మాజీ మంత్రి కేటీఆర్ కు తెలిసే జ‌రుగుతున్నాయ‌ని మండిప‌డ్డారు. ఈ పోస్టుల మీద కేటీఆర్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బ‌ల్మూరి వెంక‌ట్ డిమాండ్ చేశారు.

MLC Balmoori Venkat Slams KTR

లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. లేక పోతే దాడుల‌కు దిగుతామ‌ని అన్నారు. రేవంత్ రెడ్డిపై పెట్టిన పోస్ట్ వల్ల తెలంగాణలోని యువత, విద్యార్థుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై దాడులకు పాల్ప‌డ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ పోస్టులకు కేటీఆర్‌ను బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతూ వ‌స్తోంది.

Also Read : R Ashwin Fired on Gambhir : కోచ్ గంభీర్ పై భ‌గ్గుమ‌న్న ర‌విచంద్ర‌న్ అశ్విన్

Exit mobile version