R Ashwin Fired on Gambhir : కోచ్ గంభీర్ పై భ‌గ్గుమ‌న్న ర‌విచంద్ర‌న్ అశ్విన్

కుల్దీప్ యాద‌వ్ ను విస్మ‌రించ‌డం దారుణం

Hello Telugu - R Ashwin Fired on Gambhir

Hello Telugu - R Ashwin Fired on Gambhir

R Ashwin : చెన్నై : భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధానంగా మూడు ఫార్మాట్ ల‌లో వ‌న్డే, టెస్టు ఫార్మాట్ ల‌కు ముంబై క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ ను ఎంపిక చేయ‌డం ఇందులో ఒక‌టి. మ‌రో వైపు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ తో పాటు కుల్దీప్ యాద‌వ్ ను ఎంపిక చేయ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (R Ashwin). ఈ ఇద్ద‌రూ దుబాయ్ వేదిక‌గా తాజాగా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 టోర్నీలో అద్భుతంగా రాణించార‌ని, త‌మ స‌త్తాతో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నాడు. కానీ ఈ ఇద్ద‌రినీ ఆస్ట్రేలియా టూర్ లో వ‌న్డే జ‌ట్టుకు ఎంపిక చేయ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు అశ్విన్.

R Ashwin Slams Gambhir

ఇదిలా ఉండ‌గా కుల్దీప్ యాద‌వ్ ను వ‌దిలి వేసి, ఎక్కువ మంది ఆల్ రౌండ‌ర్ల‌ను ఆడించ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఇది పూర్తిగా జ‌ట్టును నిర్వీర్యం చేయ‌డం త‌ప్పా మ‌రోటి కాద‌న్నాడు. ఇలాంటి త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల‌నే ఇండియా చేతులెత్తేసింద‌ని, తొలి వ‌న్డేలో 7 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంద‌న్నాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దయచేసి బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టండి, కుల్దీప్ ఈ పెద్ద మైదానాల్లో స్వేచ్ఛగా బౌలింగ్ చేయలేకపోతే అతను ఎక్కడ బౌలింగ్ చేస్తాడని ప్ర‌శ్నించాడు. ప్ర‌ధానంగా స్టార్ బ్యాట‌ర్ సంజూ శాంసన్, బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ ల‌ను విస్మ‌రించ‌డం జ‌ట్టుకు న‌ష్టం త‌ప్ప లాభం కాద‌న్నాడు.

Also Read : Manda Krishna Madiga Shocking Comments : ఆత్మ గౌర‌వానికి ఆటంకం క‌లిగితే ఊరుకోం

Exit mobile version