అక్టోబ‌ర్ 4న ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన యుబిటి చీఫ్ రాజ్ ఠాక్రే

hellotellugu-RajThakceray

ముంబై : మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన (యుబిటీ ) పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అక్టోబర్ 4న ముంబైలో ఎన్నికల సంఘం నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పెద్ద ఎత్తున నిర‌స‌న ర్యాలీ చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ర్యాలీకి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీ , ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) కలిసి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఒక నిరసన ర్యాలీని (మోర్చా) నిర్వహిస్తాయని ప్ర‌క‌టించారు. “ఈ ర్యాలీకి తాము అన్ని పార్టీలు పాల్గొనాల్సిందిగా ఇప్ప‌టికే ఆహ్వానించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ముంబైలో మంగ‌ళ‌వారం తన సోదరుడు, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో రాజ్ ఠాక్రే అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్ ) ప్రక్రియలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిపై పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.

10 నెలల కాలంలో కనీసం 14 సందర్భాలలో తీసుకున్న నిర్ణయాలు , జారీ చేసిన ఆదేశాలపై (వాటిలో కొన్ని తమకు తెలియకుండానే జరిగాయని పేర్కొంటూ) తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు , వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెల్లడైన నేపథ్యంలో, ప్రతిపక్షాలు కుమార్ రాజీనామాను డిమాండ్ చేశాయి. ఓటర్ల జాబితాల స‌ర్ తో అన్ని నిర్ణయాలను ముగ్గురు సభ్యుల కమిషన్ ఏకగ్రీవంగా తీసుకుందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. స‌ర్ వివాదం నేపథ్యంలో, సోమవారం నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి ంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేసింది; ఆయనను తొలగించే వరకు తమ వ్యతిరేకత కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కుమార్, జనవరి 31, 2024న పదవీ విరమణ చేసిన తర్వాత మార్చి 15, 2024న ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన గత ఏడాది ఫిబ్రవరి 19న 26వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు.

Exit mobile version