MLA Sanjay : కరీంనగర్ జిల్లా : భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే తన నియోజకవర్గంలో ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబ్బులు అడిగితే, వారు ఎవరైనా సరే , ఏ స్థానంలో ఉన్నా సరే మూకుమ్మడితో రోకలి బండలతో దాడి చేయాలని పిలుపునిచ్చారు. కావాలంటే దాడి చేసినందుకు గాను తాను మీ తరపున జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాననంటూ ప్రకటించారు. తాజాగా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ దాడి చేయాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
MLA Sanjay Shocking Comments
రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోంది. ఇందుకు గాను ప్లాటు ఉన్నట్లయితే రూ. 5 లక్షలు ఇస్తోంది. ఇందుకు గాను స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇండ్లు మంజూరు చేసేందుకు, డబ్బులు ఇప్పించేందుకు లంచంగా కొంత మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ (MLA Sanjay). ఈ మేరకు ఎవరు మీ దగ్గరకు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే మీ ఇంట్లో ఉన్న రోకళ్లతో లేదా ఇతర వస్తువలతో దాడి చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండని, అవి పొందడం మీ హక్కు అని స్పష్టం చేశారు. ఇట్లాంటి దొంగలు ఉంటారనే కేసీఆర్ పెన్షన్, రైతుబంధు, ఇతర అన్ని పథకాల డబ్బులను నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లనే జమ చేశారని గుర్తు చేశారు.
Also Read : Minister Komatireddy Interesting Comments : మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి
