Minister Komatireddy Interesting Comments : మ‌హిళా సాధికార‌త కోసం ప్ర‌భుత్వం కృషి

స్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి

Hello Telugu - Minister Komatireddy Interesting Comments

Hello Telugu - Minister Komatireddy Interesting Comments

Minister Komatireddy : న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్ర అభివృద్దిలో మ‌హిళ‌లు కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి (Minister Komatireddy). నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళామణులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1 కోటి 15 లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. అందులో కోటి మంది మహిళలకు ఆత్మ గౌరవంతో ఉండేలా నాణ్యమైన చీరలను అందించేందుకు ఇవాల్టి నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం భారీగా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని చెప్పారు. తొలి విడ‌త‌గా కోటికి పైగా చీర‌లు పంపిణీ చేస్తున్నామ‌న్నారు. రెండో విడ‌త‌లో మిగిలి పోయిన వారికి పంపిణీ చేస్తామ‌ని చెప్పారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి.

Minister Komatireddy Venkat Reddy Key Comments on Women Empowerement

మహిళల గౌరవం, శక్తివంతత, వారి సామాజిక స్థాయిని పెంచే దిశగా ఈ కార్యక్రమం కీలక అడుగుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా దేశంలో ఎక్క‌డా లేని విధంగా మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు బ‌స్సుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌ని, ఇది కాంగ్రెస్ స‌ర్కార్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు. ప్ర‌తి ఒక్క మ‌హిళ‌ను కోటీశ్వ‌రురాలిగా మార్చేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని చెప్పారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇందులో భాగంగా ఆర్టీసీతో ఒప్పందం చేసుకునేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. తొలి విడ‌త‌గా 155 బ‌స్సులు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. దీని ద్వారా స్థిర‌మైన నెల నెలా ఆదాయం స‌మ‌కూరుతుంద‌న్నారు. దాదాపు ఆర్టీసీ ద్వారా 69 వేల‌కు పైగా వ‌స్తాయ‌న్నారు.

Also Read : CP VC Sajjanar Challenge : హైద‌రాబాద్ ను సుర‌క్షిత న‌గ‌రంగా మారుద్దాం

Exit mobile version