నారా లోకేష్ రాజీనామా చేయాలి : వైఎస్ జ‌గ‌న్

డీఎస్సీ నియామ‌క ప్ర‌క్రియ‌లో అక్ర‌మాలు

hellotellugu-YSJagan

తాడేప‌ల్లి గూడెం : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వ‌హంచిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవ‌క‌లు జ‌రిగిన‌ట్లు పెద్ద ఎత్తున అభ్య‌ర్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ని అన్నారు . ఈ ఆరోపణల నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు జ‌గ‌న్ రెడ్డి.

మరోవైపు డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కూడా లోకేష్ రాజీనామాను డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా నీట్ యుజి 2026 పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఎన్. లోకేష్ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా అని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మేము అదే ప్రశ్న అడుగుతున్నామ‌ని అన్నారు. సుమారు 3.5 లక్షల మంది అభ్యర్థులు పాల్గొన్న డీఎస్సీ పరీక్షా ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన అవకతవకలకు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాల్సిన బాధ్య‌త నారా లోకేష్ పై లేదా అని నిల‌దీశారు . ఎన్డీఏ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి ఎన్. లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక, ప్రభుత్వం తాము విశ్వసిస్తున్నామని చెప్పుకునే జవాబుదారీతనం ప్రమాణాలను పాటించడానికి బదులుగా, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తన కుమారుడిని కాపాడుకుంటారా? అన్న‌ది తేలాల్సిన అవ‌స‌రంఉంద‌న్నారు. అభ్యర్థులు లేవనెత్తిన ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Exit mobile version