‘ఇందిరమ్మ టవర్స్’ హెల్ప్‌లైన్ ప్రారంభం

వివరాల కోసం 040-24603572 నంబర్‌

hellotelugu-Ponguleti

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది ఇండ్ల ల‌బ్దిదారుల కోసం. ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ పేర‌రుతో హెల్ప్ లైన్ ప్రారంభించింది. సందేహాలు, దరఖాస్తు వివరాల కోసం 040-24603572 నంబర్‌కు కాల్ చేయాల‌ని కోరింది. దరఖాస్తులను మీ-సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ , వాట్సాప్ ద్వారా సమర్పించవచ్చు అని తెలిపింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ టవర్స్’ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కోరుకునే దరఖాస్తుదారులకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దరఖాస్తుదారులు కేవలం అధికారిక సమాచారంపైనే ఆధార పడాలని, మధ్యవర్తులను , తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ, అర్హత, అవసరమైన పత్రాలు, చెల్లింపులు , కేటాయింపులకు సంబంధించిన సందేహాలు ఉన్నవారు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య 040-24603572 నంబర్‌ను సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ , ఉర్దూ భాషలలో సమాచారం అందించ బడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా క్యూర్ ప్రాంతంలో లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్ప‌ష్టం చేశారు మంత్రి. ఇందులో మొదటి దశలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణం చేపట్టడం జ‌రుగుతుంద‌న్నారు. అమలు కోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రామాణిక యూనిట్‌గా నిర్ణయించిన‌ట్లు తెలిపారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. కాబట్టి దరఖాస్తుదారులు తాము నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్న, వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలకు మించని అల్పాదాయ కుటుంబాల కోసం ఉద్దేశించిన‌ట్లు పేర్కొన్నారు . దరఖాస్తుదారు కనీసం 10 ఏళ్లుగా క్యూర్ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలని, అలాగే దరఖాస్తుదారుకు లేదా వారి కుటుంబానికి క్యూర్ ప్రాంతం లేదా ఔటర్ రింగ్ రోడ్ ప‌రిధిలో ఎటువంటి ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు అని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబం నుండి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరించడం జ‌రుగుతుంద‌న్నారు. అర్హత కలిగిన కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయించ బడుతుంద‌న్నారు.

Exit mobile version