Minister Nimmala Interesting Comments : చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల‌నే ఏపీకి గుర్తింపు

స్ప‌ష్టం చేసిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

Hello Telugu - Minister Nimmala Interesting Comments

Hello Telugu - Minister Nimmala Interesting Comments

Minister Nimmala : అమ‌రావ‌తి – తెలుగు జాతి గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు (Minister Nimmala). ఆయ‌న చేసిన కృషి వ‌ల్ల‌నే ఏపీకి గుర్తింపు వ‌చ్చింద‌న్నారు. 40 ఏళ్ల‌ సుదీర్ఘ రాజకీయ జీవితంలో అన్నీ రికార్డులే ఉన్నాయ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబెట్టడంలోనూ, అభివృద్ధి పథంలో పయనింప చేయడంలోనూ ఆయన శైలి వినూత్నం అన్నారు. పరిపాలన సంస్కరణలు, ప్రజాహితం, దార్శనికత, ముందు చూపు ఆయన ఆభరణాలు అని ప్ర‌శంస‌లు కురిపించారు. అంతర్జాతీయ మార్పులను, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ యువతకు అందించిన గొప్ప మేధావి , అరుదైన పాల‌కుడు చంద్ర‌బాబు నాయుడు అని ప్ర‌శంస‌లు కురిపంచారు.

Minister Nimmala Ramanaidu Interesting Comments on CM Chandrababu

నదుల అనుసంధానం ద్వారానే దేశ అభివృద్ధి ఆధార పడుతుందని ఆంధ్రప్రదేశ్ లో అమలుకు శ్రీకారం చుట్టిన అన్నదాతల ఆత్మ బంధువు చంద్ర‌బాబు నాయుడేన‌ని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల వారికి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించిన వైనం ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంద‌న్నారు. మహిళలకు ఆస్తి హక్కు అమలు జరపడం లోనూ, మహిళా సాధికారతకు అనేక వినూత్న పథకాలు ప్రవేశ పెట్టిన చంద్రబాబు ముద్ర చిరస్మరణీయం అన్నారు.

ఇదిలా ఉండ‌గా నేటి ఆధునిక తెలంగాణకు సాంకేతిక, మౌలిక వసతుల బలమైన పునాది చంద్రబాబే వేశాడ‌ని కొనియాడారు మంత్రులు నార‌య‌ణ‌, ఆనం , ఎస్. స‌విత‌. 2014లో రాష్ట్ర విభజన అనంతరం సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని రూపకల్పన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా అభివృద్ధి, రాయలసీమలో పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడం వంటి పలు ప్రధాన కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. దేశ రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా కీలక పాత్ర పోషించి, జాతీయ స్థాయిలోనూ తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచిన అరుదైన నాయకుడు చంద్రబాబేన‌న్నారు.

Also Read : Deputy CM Pawan Kalyan Interesting Update : ప్రతి నెలా రెండుసార్లు సమీక్ష చేస్తా

Exit mobile version