Pawan Kalyan : అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి తాను స్వయంగా రెండుసార్లు సమీక్ష చేపడతామని వెల్లడించారు. ఉప్పాడలో తీర ప్రాంతం కోత సమస్యను జనవాణిలో తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఆ సమస్యను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకి వివరించడం జరిగిందన్నారు. అధునాతన సాంకేతికతతో రక్షణ గోడ నిర్మాణం ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. కేంద్ర సహకారం అందుతోంది కాబట్టే. అదే విధంగా ఉప్పాడ నుంచి కాకినాడ వరకూ బీచ్ రోడ్డును అభివృద్ధి చేసి వాణిజ్య కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో (CM Chandrababu) చర్చించానని తెలిపారు.
Deputy CM Pawan Kalyan Key Comments
ఇందుకు సంబంధించి సానుకూలంగా స్పందించారని చెప్పారు పవన్ కళ్యాణ్. విద్యా వైద్య సంబంధిత సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలపై స్పందించేందుకు తన కార్యాలయంలో తగిన వ్యవస్థను ఏర్పాటు చేశానని వెల్లడించారు. సాగు నీటి సమస్యలు, పంట కాలువల మరమ్మతులలో సమస్యలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. వాటి పరిష్కారంపై ఇరిగేషన్ అధికారులతో, నియోజక వర్గంలోని నీటి సంఘాల ప్రతినిధులతో చర్చించాలని పేషీ అధికారులను ఆదేశిస్తానని తెలిపారు. పిఠాపురం నియోజక వర్గం ప్రజల ఆకాంక్షలు మరచి పోలేదన్నారు. వారు కోరుకున్న మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించానని చెప్పారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు.
మత్స్యకారులు తెలియచేసిన సమస్యలను సత్వరమే పరిష్కరించే చర్యలు చేపడతానని తెలిపారు.
నామినేషన్ వేయడానికి ముందు దర్గాకు వెళ్ళి వస్తుంటే ఇసుకపల్లి గ్రామం దగ్గర్లో కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి నాకు ఓ బొండం కొట్టి ఇచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు మీరు గెలిచాక ఇల్లు మంజూరు చేయించమన్నారు. ఆయన్ని మరచి పోలేదన్నారు పేరు, ఆధార్ నంబర్, అన్ని వివరాలు కావాలని నా కార్యాలయాన్ని అడిగాను. ఆయన పేరు జుత్తుక తాతబ్బాయి, నాగులపల్లి శివారు గ్రామంలో ఉంటారు అని చెప్పారు. ఏ విషయాన్నీ నేను మరచిపోను.
Also Read : Popular Director Ram Gopal Varma : 27 ఏళ్ల తర్వాత ఆర్జీవీతో మనోజ్ బాజ్‌పేయి
