CP VC Sajjanar : హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, దీని వారసత్వాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP VC Sajjanar). నగర సంస్కృతి , వారసత్వానికి చిహ్నమైన ఐకానిక్ చార్మినార్‌లో ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు సీపీ. ఈ చారిత్రాత్మక మైలురాయి నుండి, అవగాహన, అప్రమత్తత , సమాజ భాగస్వామ్యం ద్వారా సైబర్-సురక్షిత హైదరాబాద్‌కు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అత్యంత శక్తివంతమైన చారిత్రాత్మక నగరాన్ని డిజిటల్‌గా సురక్షితంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడానికి కలిసి పని చేద్దాం అంటూ నగర వాసులకు పిలుపునిచ్చారు.
CP VC Sajjanar Key Comments
ఇవాళ నగరం రోజు రోజుకు విస్తరిస్తోందని, లక్షలాది మంది ప్రజలు ఇక్కడ కొలువు తీరి ఉన్నారని చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణ అనేది సవాల్ గా మారిందన్నారు. ప్రతి ఒక్క పోలీస్ శక్తి వంచన లేకుండా లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు సీపీ వీసీ సజ్జనార్. అయినా ఎక్కడో ఒక చోట నేరాలు, చోరీలు కొనసాగుతున్నాయని వాటిని నియంత్రించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా సైబర్ మోసాలు ఎక్కువగా జరుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు సజ్జనార్.
Also Read : TG EC Important Update : 26న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్
