Massive Fire in Garib Rath Sensational : గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు

సిర్‌హిండ్‌ జంక్షన్‌ సమీపంలో కోచ్ లు ద‌గ్ధం

Hello Telugu - Massive Fire in Garib Rath Sensational

Hello Telugu - Massive Fire in Garib Rath Sensational

Garib Rath : పంజాబ్ : పంజాబ్ లో శ‌నివారం భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ (Garib Rath) రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి సహర్సా వెళ్తుండగా సిర్‌హిండ్‌ జంక్షన్‌ సమీపంలో భారీగా మంట‌లు ఎగ‌సి ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో 3 కోచ్‌లు దగ్ధం అయ్యాయి. ప‌నికి రాకుండా పోయింది. ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు లుథియానా నుంచి దిల్లీకి వెళ్లాల్సి ఉంది. బోగీల నుంచి పొగ, మంటలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు ప్రయాణికులు. ఇదిలా ఉండ‌గా సమాచారం అందుకున్న లోకో పైలట్‌ కూడా ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో పెను ప్రమాదం త‌ప్పింది. లేక పోతే పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం చోటు చేసుకుని ఉండేది.

Garib Rath Fire Accident

ఇదిలా ఉండ‌గా లూథియానా లోని సిర్హింద్ స్టేషన్ దాటుతుండగా ఏసీ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన ప్రయాణికులు వస్తువులు వదిలి పారిపోయారు. అమృత్‌సర్ నుండి బీహార్‌లోని సహర్సకు ప్రయాణిస్తున్న గరీబ్ రథ్ రైలులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కోచ్ నంబర్ 19లో మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో లూథియానాకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ప్రభావిత కోచ్‌లోని ప్రయాణికులు తమ వస్తువులను వదిలి త్వరగా ఖాళీ చేయించారు. ఈ గందరగోళంలో, అనేక మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే ,పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక గంటలోపు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, రైలు త్వరలోనే తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తుందని ధృవీకరిస్తూ రైల్వే శాఖ స్ప‌ష్టం చేసింది.

Also Read : Sri Lanka PM Strong Focus : ద్వైపాక్షిక సంబంధాల‌పై ఫోక‌స్ : అమ‌ర‌సూర్య‌

Exit mobile version