Sri Lanka PM : ఢిల్లీ : భారత్, శ్రీలంక దేశాల మధ్య విడదీయలేని బంధం ఉందన్నారు శ్రీలంక దేశ ప్రధానమంత్రి డాక్టర్ హరిణి అమర సూర్య (Sri Lanka PM). ప్రస్తుతం ఆమె భారత దేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా సమావేశం జరిగింది ఈ ఇద్దరి నేతల మధ్య. ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు. ఇవాళ జాతీయ ఛానల్ ఎన్డీటీవీ నిర్వహించిన ప్రపంచ సదస్సుకు అమర సూర్య, ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇదిలా ఉండగా శ్రీలంకలో చోటు చేసుకున్న సంక్షోభం అనంతరం కొత్తగా సర్కార్ కొలువు తీరింది . దాదాపు ఏడాది అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ హరిణి అమర సూర్య తొలిసారిగా ఇండియాలో కాలు మోపారు.
Sri Lanka PM Key Comments
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు, మహిళా సాధికారత, మత్స్యకారుల సంక్షేమం వంటి అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. ప్రగతి మైదానంలో ఉన్న ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ భారత్ మండపంలో ఈ కీలక సమ్మిట్ జరిగింది. పేరు పొందిన దేశాధినేతలు పాల్గొన్నారు. శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్యను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు. విద్య, మహిళా సాధికారత, ఆవిష్కరణ, అభివృద్ధి సహకారం , మత్స్యకారుల సంక్షేమం వంటి విస్తృత రంగాలపై విస్తృతంగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. సమీప పొరుగు దేశాలుగా రెండు ప్రజల శ్రేయస్సుకు, ఉమ్మడి ప్రాంతానికి సహకారం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
Also Read : Trump Important Comments : ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని ఆపాలి : ట్రంప్
