Mallikarjun Kharge : న్యూఢిల్లీ : ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో సీఎం మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్ణాటక పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ ఉన్నట్టుండి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన కేవలం డిప్యూటీ సీఎంగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సిద్దరామయ్యను మారుస్తున్నారని, డీకే సీఎం సీటు కోసం ఎసరు పెడుతున్నాడని, ఆయన ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తో టచ్ లో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా మరో వైపు కర్ణాటకకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ వద్దకు చేరుకోవడం చర్చకు దారితీసేలా చేసింది.
Mallikarjun Kharge Shocking Comments on Karnataka CM
ఈ తరుణంలో నాయకత్వ మార్పు తప్పకుండా ఉంటుందని, ప్రస్తుతం రెండున్నర ఏళ్లు సీఎంగా సిద్దరామయ్య తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారని , ఇక డీకే శివకుమార్ కు మిగతా రెండున్నర ఏళ్లు ఇస్తారంటూ గతంలో ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది. దీనిపై డిప్యూటీ సీఎం ఖండించలేదు. ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే. కర్ణాటక నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఎవరికి వారు తమకు తాముగా ఏదేదో రాసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలో అది హైకమాండ్ తీసుకుంటుందని చెప్పారు ఖర్గే. దీని గురించి పెద్దగా ఆలోచించకండి అని అన్నారు.
Also Read : MP Laxman Fired on Congress : మోదీని తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు
