MP Laxman Fired on Congress : మోదీని త‌ట్టుకునే శ‌క్తి కాంగ్రెస్ పార్టీకి లేదు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుడు

Hello Telugu - MP Laxman Fired on Congress

Hello Telugu - MP Laxman Fired on Congress

MP Laxman : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : రాజ్యసభ ఎంపీ, బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ (MP Laxman) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీని, ప్ర‌త్యేకించి ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోడీ నాయకత్వంలోని బిజెపి, ఎన్డీఏ మళ్లీ మళ్లీ గెలుస్తున్నాయ‌ని అన్నారు. దీనిని అడ్డుకోవ‌డం ఎవ‌రి త‌రం కాద‌న్నారు. రాహుల్ గాంధీకి ఎటువంటి సమస్యలు లేవు అని అన్నారు ల‌క్ష్మ‌ణ్. ఎందుకంటే గ‌త 11 సంవత్సరాలలో ప్రధాని మోడీ సమాజంలోని ప్రతి వ్యక్తికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడానికి కృషి చేశారని చెప్పారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని వార‌ణాసిలో ఎంపీ ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు.

MP Laxman Slams Congress

రాహుల్ గాంధీ తమ‌ పదవీకాలంలో ఉన్న అవినీతిని స్వయంగా వెల్లడించారని అన్నారు. బిజెపి నిరంతరం గెలుస్తున్నప్పుడు, ఆయన కొన్నిసార్లు ఈవీఎంలపై వ్యాఖ్యానిస్తారు, మ‌రి కొన్నిసార్లు ఓటు దొంగతనం అంశాన్ని లేవనెత్తుతారంటూ మండిప‌డ్డారు. ఈ విధంగా ప్రజలు రాహుల్ గాంధీని తేలికగా తీసుకుంటున్నార‌ని, ఆ విష‌యం త‌ను గుర్తించ‌డం లేద‌న్నారు. నేడు, అనేక ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ కారణంగా నష్టాలను చవి చూస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇండియా కూట‌మిలో రాహుల్ గాంధీ ఒక్క‌డే మిగిలి పోతాడ‌ని జోష్యం చెప్పారు ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌.

Also Read : Vijayasai Reddy Shocking Comments : ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నాది 20 ఏళ్ల స్నేహ బంధం

Exit mobile version