Metro : హైదరాబాద్ : హైదరాబాద్ లో మెట్రో రైలు (Metro) సేవలను విస్తరించేందుకు ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో ఎల్ అండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్ పాల్గొన్నారు.
L&T Exit from Metro
ఎల్ అండ్ టీ గ్రూప్ సిఎండి ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్, సీఎండీ సలహాదారు డి.కె. సేన్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (LTMRHL) ఎండీ, సిఈవో కె.వి.బి.రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా మెట్రో రైలు ఫేజ్ 1లో తమకున్న మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఎల్ అండ్ టీ మెట్రో పై ప్రస్తుతం ఉన్న దాదాపు రూ. 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. దీంతో పాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ. 2,000 కోట్లు వన్–టైమ్ చెల్లింపు అందించాలని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది.
Also Read : Pawan Kalyan Interesting Comments : నూతన పంతుళ్లకు పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్
