Pawan Kalyan Interesting Comments : నూత‌న పంతుళ్లకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంగ్రాట్స్

విద్యార్థుల‌ను భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దాలి

Hello Telugu - Pawan Kalyan Interesting Comments

Hello Telugu - Pawan Kalyan Interesting Comments

Pawan Kalyan : అమ‌రావ‌తి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల (Pawan Kalyan) ఏపీలో మెగా డీఎస్సీ – 2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎన్నో ఏళ్ళుగా డీఎస్సీ కోసం నిరీక్షించారని, వారి శ్ర‌మ ఫ‌లించింద‌న్నారు. ఏక కాలంలో 15,941 మంది ఉపాధ్యాయులను నియమించ‌డం జరిగింద‌న్నారు. ఈ శుభ సమయం రాష్ట్ర విద్యారంగంలో చిరస్థాయిగా మిగిలి పోతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. త‌ద్వారా వారికి దారి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

Deputy CM Pawan Kalyan Praises New Teachers

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఎస్సీ నియామకాలపై తొలి సంతకం చేశార‌ని గుర్తు చేశారు ఈ సంద‌ర్బంగా. త‌న‌ మార్గదర్శకంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని ప్ర‌శంసించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని వెల్ల‌డించారు. ఆరోగ్యం సహకరించని దృష్ట్యా డీఎస్సీ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమానికి నేను స్వయంగా హాజరు కాలేక పోయానని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవితకు బాటలు వేసే బృహత్తర బాధ్యత ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న ఉపాధ్యాయులపై ఉందన్నారు.

Also Read : CM Chandrababu Interesting Comments : టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణకు ఐసీసీ సెంటర్

Exit mobile version