KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు అరుదైన గౌరవం లభించింది. శ్రీలంకలో జరిగే ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025 లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ సందర్బంగా సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సదస్సు నవంబర్ 10 నుంచి 12 వరకు రెండు రోజుల పాటు కొలంబోలోని ‘ది కింగ్స్‌బరీ హోటల్’లో జరగనుంది . శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున GETS శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయూఎల్ఏ హిల్మీ ఈ ఆహ్వానాన్ని కేటీఆర్‌కు పంపారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ (Digital Transformation), ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకు రానుంది.
KTR Gets Invitation from GETS
డాక్టర్ హిల్మీ తన లేఖలో కేటీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలలో తెలంగాణను భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పోషించిన విశిష్ట నాయకత్వాన్ని, పాత్రనును కొనియాడారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక, సాంకేతిక కార్యక్రమాలను ఆయన నడిపించిన విధానం అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఒక ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కేటీఆర్ పాల్గొనడం వల్ల దక్షిణ ఆసియాలోని విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి పొందుతారని GETS 2025 సదస్సు కార్యదర్శి స్పష్టం చేశారు.
Also Read : Harish Rao Interesting Update : తెలంగాణలోనే దున్నలకు పూజలు
