Harish Rao Interesting Update : తెలంగాణ‌లోనే దున్న‌ల‌కు పూజ‌లు

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Interesting Update

Hello Telugu - Harish Rao Interesting Update

Harish Rao : హైద‌రాబాద్ : ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా బ‌తుక‌మ్మ‌తో పూల‌ను పూజించ‌డం, దున్న‌ల‌కు స‌ద‌ర్ పేరుతో పూజ‌లు చేయ‌డం ఒక్క తెలంగాణ‌లోనే చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao). నారాయణగూడలో నిర్వ‌హించిన‌ సదర్ వేడుకలకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా యాదవ సోదర సోదరీమణులకు సదర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సదర్ అంటే ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. యాదవ జాతి దీపావళి సందర్భంగా దున్నలను పూజించే గొప్ప సంస్కృతికి ఈ పండుగ చిహ్నంగా ఉంద‌న్నారు. దీపావళి అంటేనే మహాలక్ష్మి అని, లక్ష్మీ దేవతకు పూజిస్తామ‌న్నారు. యాదవులకు లక్ష్మీ ఏమిటంటే పాలు. మరి ఆ పాలను ఇచ్చినటువంటి పాడి వంటి దున్నలను పూజించే ట‌టువంటి గొప్ప సంస్కృతి మన హైదరాబాద్‌కు మాత్రమే దక్కిందన్నారు హ‌రీశ్ రావు.

Ex Minister Harish Rao Key Comments

పుష్పాలను పూజించేది బతుకమ్మ పండుగ అని, పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతం అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదర్ పండుగను అధికారికంగా జరిపార‌ని పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సదర్ పండుగను అధికారికంగా జరుపుతామని మాటలకే పరిమితమైందని, కానీ ఒక్క‌ రూపాయి కూడా ఇవ్వ లేద‌ని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సదర్ నిర్వహణకు పోయిన సంవత్సరం ఒక రూపాయి ఇవ్వ లేద‌ని, ఈ సంవత్సరం కూడా ఇవ్వ లేద‌ని ఆరోపించారు.

Also Read : Minister Savitha Fired on Jagan : జ‌గ‌న్ హ‌యాంలో ఏరులై పారిన మ‌ద్యం

Exit mobile version