Komatireddy Raj Gopal Reddy Proven : సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు మ‌ద్ద‌తు ఇస్తా

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

Hello Telugu - Komatireddy Raj Gopal Reddy Proven

Hello Telugu - Komatireddy Raj Gopal Reddy Proven

Komatireddy Raj Gopal Reddy : హైద‌రాబాద్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియా గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అక్ష‌రం ముక్క రాని వాళ్లు, ప్రెస్ అంటూ, రిపోర్ట‌ర్ల‌మంటూ ఊరేగుతున్నార‌ని, వారిని చూస్తే కొట్టాల‌ని అనిపిస్తుంద‌ని వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. ఆయ‌న నోరు పారేసు కోవ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని తీవ్రంగా వార్నింగ్ కూడా ఇచ్చారు డిజిట‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టులు.

Komatireddy Raj Gopal Reddy Support

ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy). సోమ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఘాటుగా జ‌వాబు ఇచ్చారు. పేరు ఎత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నేరుగానే విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం నవ తెలంగాణ దినపత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాను అవహేళన చేస్తూ తీవ్రంగా ఆరోపణలు చ‌శారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి మెసేజ్ పోస్ట్ చేశారు.

ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని పేర్కొన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందన్నారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేన‌ని అన్నారు.. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించద‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Minister JP Nadda Happy : అవ‌య‌వ దానంలో తెలంగాణ టాప్

Exit mobile version