JP Nadda : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రం అరుదైన ఘనతను సాధించింది. అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మంత్రి. అవయవ దానాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో కొనసాగుతోందని, ఈ సందర్బంగా ప్రసంశలు కురిపించారు. తెలంగాణ జీవందన్ కార్యక్రమంలో సత్కరించారు, ఇది అవయవ దానాన్ని ప్రోత్సహించడంలో, ప్రాణాలను కాపాడడంలో ఒక ప్రామాణిక చొరవగా చెప్పవచ్చు.
Union Minister JP Nadda Appreciates Telangana
2024 నుండి అధికారిక డేటా ప్రకారం, తెలంగాణ 10 లక్షల (1 మిలియన్) జనాభాకు 4.88 అవయవ దానాలను నమోదు చేసింది. ఇది జాతీయ సగటు 0.8ని గణనీయంగా అధిగమించింది. ఈ విజయం అవయవ దానం ద్వారా ప్రాణాలను కాపాడటం పట్ల రాష్ట్రంలో పెరుగుతున్న అవగాహన, వైద్య సమన్వయం, నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. 188 మంది మెదడు చనిపోయిన దాతలు ఈ గొప్ప కార్యక్రమానికి దోహద పడ్డారన్నారు. జీవందన్ కార్యక్రమం ద్వారా సాధ్యమైన అవయవ మార్పిడి ద్వారా 725 మంది ప్రాణాలను కాపాడారని వెల్లడిచారు జేపీ నడ్డా (JP Nadda).
10 లక్షల జనాభాకు 4.88 మంది అవయవ దాతలుగా తెలంగాణ భారతదేశంలోనే అత్యధికంగా నిలిచింది. ఈ అద్భుతమైన సహకారాన్ని గుర్తించి, కేంద్ర మంత్రి జె.పి. నడ్డా తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన NOTTO అవార్డు (జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ)ను ప్రదానం చేశారు. ఈ జాతీయ గుర్తింపు తెలంగాణ ఆరోగ్య మౌలిక సదుపాయాల విజయాన్ని, ప్రజా అవగాహనను బలోపేతం చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలు అనుకరించడానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తుంది.
Also Read : CM Revanth Reddy Alarming : 20 నెలల్లోనే హైద్రాబాద్ గ్లోబల్ జీసీసీ హబ్
