Ex MLA Kethireddy Fired on CM : బీటెక్ ర‌వి భార్య కాదు చంద్ర‌బాబే పోటీ

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట రామి రెడ్డి

Hello Telugu - Ex MLA Kethireddy Fired on CM

Hello Telugu - Ex MLA Kethireddy Fired on CM

Kethireddy : క‌డ‌ప జిల్లా – వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. తాజాగా పులివెందుల లో జిల్లా ప‌రిష‌త్ ప్రాదేశిక స‌భ్యుడి (జెడ్పీటీసీ) కి సంబంధంచి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. దీంతో అధికారంలో ఉన్న కూట‌మికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీకి మ‌ధ్య పోటీ మ‌రింత పెరుగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు దాడుల‌కు దిగుతున్నారు. టీడీపీ శ్రేణులు దాడికి పాల్ప‌డ‌డంతో వైసీపీకి చెందిన కొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ త‌రుణంలో అంద‌రి క‌ళ్లు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌పై ఉంది. ఎవ‌రు గెల‌వ బోతున్నార‌నే దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

Ex MLA Kethireddy Key Comments

ఈ సంద‌ర్బంగా గురువారం త‌మ పార్టీకి చెందిన అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట రాంరెడ్డి (Kethireddy) ప్ర‌చారం చేప‌ట్టారు. ఆయ‌న ఇంటింటికీ తిరుగుతున్నారు. మీడియాతో మాట్లాడారు. పులివెందుల ZPTC ఉప ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట అని ఆ విష‌యం రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి తెలుస‌న్నారు.

దాన్ని మరోసారి నిలబెట్టడానికే ఎన్నికల ప్రచారానికి తాను రావ‌డం జ‌రిగింద‌న్నారు కేతిరెడ్డి వెంక‌ట రాం రెడ్డి. ఇక్కడ పోటీ చేస్తోంది బీటెక్ రవి భార్య కాదని, పరోక్షంగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడే పోటీ చేస్తున్నాడ‌ని ప్ర‌క‌టించారు. తాము కూడా బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స్థానాల‌ను గెలిచామ‌న్నారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే చెప్పాడు నిధులన్నీ పులివెందులకేనా అని, మరి ఇప్పుడెలా అభివృద్ధి చేయలేదని మాట్లాడతారంటూ ప్ర‌శ్నించారు . ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసు అన్నారు.

Also Read : CM Revanth Reddy Shocking Comments : రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదు

Exit mobile version