CM Revanth Reddy : ఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలపై. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే చాలని చెప్పారు. తమకు న్యాయస్థానం పట్ల గౌరవం ఉందన్నారు. ఆ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామన్నారు. ఎక్కడా గీత దాట లేదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు మేరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. కాగా 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ కమిట్మెంట్ ఏమిటో నిరూపించుకుందని పేర్కొన్నారు.
CM Revanth Reddy Key Comments
తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించ లేరన్నారు. తమ పోరాటం కేంద్రంపై కాబట్టి జంతర్ మంతర్ వద్ద మా గొంతు వినిపించామని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మాజీ సీఎం కేసీఆర్ ఆర్డినెన్స్ తెచ్చారు కాబట్టి సవరించిన ముసాయిదా గవర్నర్ కి పంపించడం జరిగిందన్నారు. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మోదీ చేతుల్లో రాష్ట్రపతి ఉన్నారా అదైనా చెప్పాలంటూ రేవంత్ రెడ్డి తిరిగి మీడియాను ప్రశ్నించారు. దీంతో వారంతా విస్మయానికి గురయ్యారు.
ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పొలిటికల్ రిజెర్వేషన్స్ లో సబ్ కేటగరైజేషన్ లేదన్నారు. ముస్లింలకు రిజర్వేషనే లేదని, ఆ మాత్రం కూడా తెల్వకుండా కేంద్ర మంత్రి ఎలా అయ్యాడో తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు.
Also Read : Shashi Tharoor Shocking Comments : భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలి – థరూర్
