MP Kesineni Sivanath Alarming : లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

స్ప‌ష్టం చేసిన టీడీపీ ఎంపీ కేశినాని శివ నాథ్

Hello Telugu - MP Kesineni Sivanath Alarming

Hello Telugu - MP Kesineni Sivanath Alarming

Kesineni Sivanath : అమ‌రావ‌తి – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం కార‌ణంగా పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని ప‌లు ప్రాజెక్టులకు వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతోంది. దీంతో ఏపీ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఇదిలా ఉండ‌గా ఎగువ ప్రాంతాల నుంచి ప్ర‌కాశం బ్యారేజ్ కి భారీ వ‌ర‌ద నీరు చేరింది. దీంతో జిల్లా అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (Kesineni Sivanath). ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా తో మాట్లాడారు. వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. వ‌ర‌ద నీరు 3 ల‌క్ష‌ల నుంచి క్ర‌మంగా 5 లక్ష‌ల వ‌ర‌కు పోటేత్తే అవ‌కాశం వున్నందున పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు ఎంపీ.

MP Kesineni Sivanath Key Comments

కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌ను, లోత‌ట్టు ప్రాంత వాసుల‌ను అప్ర‌మ‌త్తం చేయాలన్నారు. ఆయా కేంద్రాలకి త‌ర‌లించి తాగునీరు, ఆహారం, మందులు వంటి త‌గిన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలెర్ట్ గా వుండాల‌ని, అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్య‌లు త‌క్ష‌ణం చేప‌ట్టాల‌ని కోరారు. వాగులు పొంగే ప్రాంతాల్లో ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా హెచ్చ‌రిక బోర్డులు పెట్టాల‌ని సూచించారు ఎంపీ కేశినాని శివ‌నాథ్. ఎప్ప‌టిక‌ప్పుడు వ‌ర‌ద ప‌రిస్థితిని త‌న‌కి తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు . వ‌రద కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది, ప్ర‌మాదాలు క‌ల‌గ‌కుండా అన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని సూచించారు.

మ‌రో వైపు రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ జైన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే 72 గంట‌ల్లో భారీ ఎత్తున వ‌ర్షాలు కుర‌స్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Also Read : Hero Rajinikanth Coolie : రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ రేట్ల పెంపు

Exit mobile version