Hero Rajinikanth Coolie : రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ రేట్ల పెంపు

ఆగ‌స్టు 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల

Hello Telugu - Hero Rajinikanth Coolie

Hello Telugu - Hero Rajinikanth Coolie

Coolie : త‌మిళ సినీ న‌టుడు, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కీ రోల్ పోషించిన చిత్రం కూలీ ఆగ‌స్టు 14న గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్బంగా మూవీ మేక‌ర్స్, నిర్మాత‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది స‌ర్కార్. ఈ మేర‌కు అద‌న‌పు షోల‌కు ప‌ర్మిష‌న్ ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది . ఈనెల 14 నుంచి 23 వరకు సినిమా టికెట్ల పెంచుకునేందుకు ఓకే చెప్పింది. సింగల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగించింది. ముంద‌స్తు టికెట్ల‌ కొనుగోలులో దుమ్ము రేపింది. ద‌క్షిణాదిన పెద్ద ఎత్తున వ‌సూళ్లు చేసింది. విచిత్రం ఏమిటంటే ర‌జ‌నీకాంత్ సినీ కెరీర్ లో ఓవర్సీస్ లో అత్య‌ధికంగా రైట్స్ అమ్ముడు పోవ‌డం సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఏకంగా కూలీ (Coolie) మూవీ రూ. 80 కోట్ల‌కు పైగా అమ్ముడు పోయింది.

Coolie Movie Ticket Price Updates

త‌మిళ సినీ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ కూలీని భారీ బ‌డ్జెట్ తో నిర్మించింది. ఇప్ప‌టికే ఆ సంస్థ భారీ న‌మ్మ‌కం పెట్టుకుంది ఈ చిత్రంపై. త‌ప్ప‌కుండా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో కూలీ చిత్రానికి హైలెట్ గా నిలిచింది స్పెషల్ సాంగ్. మౌనికా అన్న పాట టాప్ లో కొన‌సాగుతోంది. దీనికి సంగీతం అందించారు అనిరుధ్ ర‌విచంద‌ర్. ఇందులో పూజా హెగ్డేతో పాటు మ‌ల‌యాళం మూవీ స్టార్ హీరో షాబీర్ న‌టించాడు. ఇందులో ర‌జనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున‌, ఉపేంద్ర‌, స‌త్య‌రాజ్ , అమీర్ ఖాన్ , సౌబీర్ , ఇల‌య‌నాయ‌గ‌న్ త‌న‌య‌, ప్ర‌ముఖ న‌టి శ్రుతీ హాస‌న్ కూడా న‌టిస్తోంది. ఈ సినిమా కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా త‌లైవా అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Also Read : Popular Actress Lavanya Tripathi : అల‌రిస్తున్న లావ‌ణ్య చిత్తూరు పిల్ల

Exit mobile version