Kavitha : వనపర్తి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) వనపర్తి జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆమె చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. తొలుత కొత్తకోట మండ పరిధిలోని వీవర్స్ కాలనీలోని చేనేత కుటుంబాలను పరామర్శించారు. వారికి నిలిపి వేసిన సబ్సిడీని వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అనంతరం వనపర్తిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. అక్కడి నుంచి నేరుగా కడుకుంట్ల గ్రామంలో పర్యటించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. పెబ్బేరు మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Ex MLC Kavitha Demand for Farmers
పాతపల్లిలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. 24వ తేదీన సోమవారం వనపర్తి పట్టణం లోని భగీరథ విగ్రహం పక్కన గల విక్టోరియా బ్యాంకెట్ హల్ లో ఉద్యమకారులు, మేధావులతో, వివిధ కుల సంఘాలతో, మేధావులతో సమాలోచన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేధో మధనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. మీ అనుభవాలను, విలువైన సలహాలు, సూచనలు చేయాలని కోరారు.
Also Read : CM Chandrababu Important Comments : సత్యసాయి బాబా జీవితమే ఓ సందేశం
