CM Chandrababu Important Comments : స‌త్య‌సాయి బాబా జీవిత‌మే ఓ సందేశం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

Hello Telugu - CM Chandrababu Important Comments

Hello Telugu - CM Chandrababu Important Comments

CM Chandrababu : శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గవాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా అందించిన సందేశం , చేసిన నిస్వార్థ‌మైన సేవ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). మన ముందు నడయాడిన దైవం భగవాన్ అని కొనియాడారు. శ్రీ సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించు కుందామ‌ని పిలుపునిచ్చారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గం, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారంతో సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారని చెప్పారు సీఎం. ప్రపంచానికి సాయి సిద్దాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారని అన్నారు. పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చార‌ని చెప్పారు.

CM Chandrababu Important Comments on Sathya Saibaba

అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంటూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించి నిరూపించిన మ‌హోన్న‌త మాన‌వుడు భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా. విద్య, వైద్యం, తాగునీరు, మానసిక ప్రశాంతత వంటి కార్యక్రమాలతో కోట్ల మంది జీవితాల్లో మార్పులు తెచ్చారని అన్నారు. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్య సాయికి మరొక్కమారు దివ్యాంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ప్ర‌భుత్వాలు చేయ‌లేని ప‌నుల‌ను శ్రీ స‌త్య‌సాయి బాబా చేసి చూపించార‌ని గుర్తు చేశారు.

Also Read : KTR-Southern Rising Summit Interesting : సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 స‌ద‌స్సులో కేటీఆర్

Exit mobile version