K Kavitha Huge Support Saudi Bus Victims : మ‌క్కా బ‌స్సు బాధిత కుటుంబాల‌కు క‌విత భ‌రోసా

ఓదార్చిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు

Hello Telugu - K Kavitha Huge Support Saudi Bus Victims

Hello Telugu - K Kavitha Huge Support Saudi Bus Victims

K Kavitha : హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలోని మ‌క్కాలో జ‌రిగిన బ‌స్సు ద‌హ‌నం ఘ‌ట‌న‌లో హైద‌రాబాద్ కు చెందిన ముస్లిం కుటుంబాలు ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (K Kavitha). ఆమె చేప‌ట్టిన జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వెంట‌నే హుటా హుటిన ఆమె హైద‌రాబాద్ కు విచ్చేశారు. ఆ వెంట‌నే బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. వారిని ఓదార్చారు . ఆసిఫ్ నగర్ లోని నటరాజ్ నగర్ లో గల ఉన్న మృతి చెందిన కుటుంబాల‌కు ధైర్యం చెప్పారు. అనుకోకుండా జ‌రిగిన ఈ ఘ‌ట‌న త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు.

K Kavitha Support to Saudi Bus Victims

ఇదిలా ఉండ‌గా బ‌స్సు పూర్తిగా ద‌హ‌నం కావ‌డంతో అందులో ప్ర‌యాణం చేస్తున్న వారి శ‌రీరాలు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా త‌యార‌య్యాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం వీరి కోసం కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజహ‌రుద్దీన్ తో పాటు ఎంఐఎం, ఉన్న‌తాధికారులతో కూడిన బృందం హుటాహుటిన సౌదీకి బ‌య‌లుదేరింది. అక్క‌డ ఏర్పాట్ల‌ను చేసింది. మ‌రో వైపు హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కేంద్ర స‌ర్కార్ తో మాట్లాడారు. విదేశాంగ శాఖ మంత్రితో పాటు అక్క‌డి రాయ‌బారితో సంభాషించారు. అక్క‌డే అంత్య‌క్రియ‌లు జ‌రిపిస్తామ‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది. మృతుల కుటుంబాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్కొక్క‌రికి రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది.

Also Read : MLA Palle Sindhura-Puttaparthi Huge Funds : పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు

Exit mobile version