MLA Palle Sindhura-Puttaparthi Huge Funds : పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు

కేటాయించినందుకు డిప్యూటీ సీఎంకు ధ‌న్య‌వాదాలు

Hello Telugu - MLA Palle Sindhura-Puttaparthi Huge Funds

Hello Telugu - MLA Palle Sindhura-Puttaparthi Huge Funds

MLA Palle Sindhura : అమ‌రావ‌తి : శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి శాస‌న స‌భ నియోజక‌వ‌ర్గానికి తీపి క‌బురు చెప్పారు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఈ మేర‌కు పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి సాస్కీ పథకం నుంచి రూ.35 కోట్ల నిధులు కేటాయించారు. ఈ సంద‌ర్బంగా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ల్లె సింధూర రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అడిగిన వెంట‌నే ఎలాంటి ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే నిధులు కేటాయించార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా రహదారి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్ర‌త్యేకంగా డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు.

MLA Palle Sindhura Reddy Thanks To DY CM Pawan Kalyan

శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారితో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న ముందుకు తీసుకు వ‌చ్చారు. రాష్ట్రంలోనే శ్రీ స‌త్య‌సాయి జిల్లాను రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి, ప‌ల్లె సింధూర రెడ్డి (MLA Palle Sindhura). సత్యసాయి జిల్లా పరిధిలోని అమడుగూరు, బుక్కపట్నం, కొత్త చెరువు, నల్లమడ, ఓబుల దేవర చెరువు తదితర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి చేరే రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ నియోజకవర్గం పరిధిలో 19 రోడ్లు, 72 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం విదితమే.

Also Read : MLA Harish Rao Shocking Comments : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో నైతిక విజ‌యం బీఆర్‌ఎస్‌దే

Exit mobile version