Myanmar Air Strike Sensational : మయన్మార్‌లో జుంటా వైమానిక దాడి – 19 మంది విద్యార్థుల మృతి

మృతులలో పిన్న వయస్కులు కూడా ఉన్నారని తెలిపింది..

Hello Telugu - Myanmar Air Strike Sensational

Hello Telugu - Myanmar Air Strike Sensational

Myanmar Air Strike : మయన్మార్‌లో మళ్లీ దారుణం చోటుచేసుకుంది. రఖైన్‌ రాష్ట్రంలో జరిగిన వైమానిక దాడిలో కనీసం 19 మంది విద్యార్థులు మృతి చెందినట్లు అరాకాన్‌ ఆర్మీ (AA) శనివారం (సెప్టెంబర్ 13, 2025) ప్రకటించింది. మృతులలో పిన్న వయస్కులు కూడా ఉన్నారని తెలిపింది.

Myanmar Air Strike Sensational

అరాకాన్‌ ఆర్మీ ప్రకటన ప్రకారం, రఖైన్‌లోని క్యౌక్ఠా పట్టణంలోని రెండు ప్రైవేట్‌ పాఠశాలలపై అర్ధరాత్రి సమయంలో జుంటా బాంబులు వేసింది. 15 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు గల 19 మంది విద్యార్థులు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు.

2021లో ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వం కూల్చివేత తరువాత మయన్మార్‌లో (Myanmar) అనేక ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. రఖైన్‌లో జుంటా బలగాలు, అరాకాన్‌ ఆర్మీ మధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. గత ఏడాదిలో ఆర్మీ అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.

స్థానిక మీడియా ‘మయన్మార్ నౌ’ నివేదిక ప్రకారం, జుంటా యుద్ధ విమానం 500 పౌండ్ల బాంబులను పాఠశాలపై వదలగా, ఆ సమయంలో విద్యార్థులు నిద్రలో ఉన్నారు.

యూనిసెఫ్‌ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. “నిర్దోషి పిల్లలు, కుటుంబాలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం. రఖైన్‌లో పెరుగుతున్న హింసలో ఇది మరొక దారుణ ఉదాహరణ” అని పేర్కొంది.

రఖైన్‌ ప్రాంతంలో ఇంటర్నెట్‌, ఫోన్‌ సేవలు సరిగా లేకపోవడంతో మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. అయితే మయన్మార్‌ సైన్యం పలుమార్లు పౌరులపై బాంబులు, ఆర్టిలరీ దాడులు చేస్తున్నదన్న ఆరోపణలు మళ్లీ బలపడ్డాయి.

Also Read : Indian Govt Interesting Updates : మరో 2 ఏళ్లలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధ కేంద్రాలు

Exit mobile version