Jajula Srinivas Goud Important Update : బీసీ రిజర్వేషన్ల పెంపు బీసీల పోరాట విజయం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

Hello Telugu - Jajula Srinivas Goud Important Update

Hello Telugu - Jajula Srinivas Goud Important Update

Jajula Srinivas Goud : హైద‌రాబాద్ : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేయడం ఎంతో హర్ష‌నీయ‌మ‌మ‌ని, ఇది బీసీల పోరాట విజయంగా తాము భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు కులగణ‌న‌ చేసి అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు , కేబినెట్ మంత్రుల‌కు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Jajula Srinivas Goud Key Comments on BC Reservations

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు కావాల‌ని గ‌త 22 నెలలుగా బీసీ సమాజం పోరాడుతున్నదని, బీసీల పోరాటం మూలంగానే గత 20 నెలలకు ముందే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఆకాంక్షలను గౌరవించి నేటి వరకు ఎన్నికలు నిర్వహించ లేదని అన్నారు. ఇక ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టు తీర్పు దరిమిలా బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ముందుకు వెళ్లడం స్వాగతించాల్సిన పరిణామన్నారు. ఇదిలా ఉండ‌గా ఎవ‌రైనా స‌రే బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపును అడ్డుకోవాల‌ని చూస్తే వారి భ‌ర‌తం ప‌డ‌తామ‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్.

Also Read : Minister Atchannaidu – AP Growth : రాష్ట్రం సుభిక్షంగా వ‌ర్దిల్లాలి : అచ్చెన్నాయుడు

Exit mobile version