Minister Atchannaidu : అమరావతి : దసరా ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి అవతారంలో వెలసిన దుర్గమ్మను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి అచ్చెన్నాయుడుని (Minister Atchannaidu) ఆశీర్వదించారు. ఆలయ ఈవో శీనా నాయక్ అమ్మ వారి ఫొటో ను మంత్రికి అందచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దసరా మహోత్సవాలు ప్రజలందరికీ శక్తి, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించే పవిత్ర వేళ. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
Minister Atchannaidu Comments
రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు పగలు-రాత్రి శ్రమిస్తున్నారని చెప్పారు. ఆయన దూరదృష్టి, సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాది వేస్తోందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పరిశ్రమ రంగాలలోనే కాకుండా ప్రతి పేద కుటుంబానికి వెలుగులు నింపే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ఆకాంక్షతో సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఒక పథకం కాదు, అది ప్రజాసేవకు ప్రతిరూపం అన్నారు. ఇదిలా ఉండగా అమ్మ వారి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Also Read : Sonam Wanghchuk Shocking : పర్యావరణ నేత సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్
