క‌రువు ప‌రిస్థితుల‌ను అధిగించేందుకు సిద్దంగా ఉన్నాం

అఖిల‌ప‌క్షం స‌మావేశంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

hellotelugu-BhattiVikramarka

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ఎల్ నినో ప్ర‌భావం కార‌ణంగా చోటు చేసుకున్న ప‌రిస్థితుల‌పై అఖిల‌ప‌క్షంతో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌. ఈ స‌మావేశానికి ఆయా పార్టీల ప్ర‌తినిధుల‌తో పాటు మంత్రులు వాకిటి శ్రీ‌హ‌రి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ తదిత‌రులు హాజ‌ర‌య్యారు. రాష్ట్ర సచివాలయంలో ‘ఎల్ నినో’ (ప్రభావం , కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష సమావేశంలో ప‌లువురు కీల‌క సూచ‌న‌లు చేశారు. త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ , బీజేపీ , ఏఐఎంఐఎం , సీపీఐ , సీపీఎం , టీజేఎస్ , ఎస్పీ , ఆర్జేడీ , బీఎస్పీ , ఆప్ , టీడీపీ పార్టీల ప్రతినిధులు, రైతు కమిషన్ చైర్మన్, మంత్రులు , ఉన్నతాధికారులు పాల్గొని విలువైన సూచనలు అందించారు.

రాష్ట్రంలో తలెత్తిన కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలతో సిద్ధంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌స్టం చేశారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. సంక్షోభ సమయంలో రాజకీయ విమర్శలకు తావులేకుండా, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ అన్ని పార్టీలు ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు. తాగునీరు, సాగునీరు , విద్యుత్ కొరత లేకుండా చూసేందుకు తాము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే కేంద్రానికి సమగ్ర నివేదికను పంపించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అవసరమైతే, రాష్ట్రానికి కావాల్సిన సహాయాన్ని పొందేందుకు అఖిలపక్ష బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్తామ‌ని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం అందరం కలిసి ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి.

Exit mobile version