ICC Womens World Cup Huge Record : భారీ స్కోర్ ఛేద‌న‌లో భార‌త మ‌హిళా జ‌ట్టు రికార్డ్

ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ లో ఆసిస్ కు షాక్

Hello Telugu - ICC Womens World Cup Huge Record

Hello Telugu - ICC Womens World Cup Huge Record

ICC Womens World Cup : ముంబై : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు న‌మోదు చేసింది భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియంలో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన‌, ఏడుసార్లు ఛాంపియ‌న్లుగా నిలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ 338 ప‌రుగులు చేసింది. 339 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం 48.3 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. చారిత్రాత్మ‌క విజ‌యాన్ని న‌మోదు చేసి అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. టీమిండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ బాధ్య‌తా యుత‌మైన ఇన్నింగ్స్ ఆడారు. త‌ను 88 బంతులు ఎదుర్కొని 89 ర‌న్స్ చేసింది. 14 ఫోర్లు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) 134 బంతులు ఎదుర్కొని 127 ర‌న్స్ చేసింది. 300 లేదా అంత‌కంటే ఎక్కువ ర‌న్స్ ఛేదిండం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

ICC Womens World Cup Sensational

వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ లో ఇరు జ‌ట్లు క‌లిపి ఒకే మ్యాచ్ లో 679 ర‌న్స్ చేశాయి. ఇది కూడా రికార్డే. అంతే కాకుండా ఈ ఐసీసీ (ICC Womens World Cup) టోర్నీలో భారీ స్కోర్ చేయ‌డం . అంతే కాకుండా ఈ టోర్నీలో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ , జెమీమా రోడ్రిగ్స్ క‌లిసి మూడో వికెట్ కు 167 ప‌రుగులు చేశారు. ఇది కూడా రికార్డే భార‌త మ‌హిళా జ‌ట్టు ప‌రంగా. ఇదిలా ఉండ‌గా ఇదే వేదిక‌పై ఆదివారం ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది టీమిండియా.

ఇక రికార్డు ప‌రంగా చూస్తే ఈ టోర్నీలో భార‌త్ పై 331 ర‌న్స్ ఛేదించింది ఆస్ట్రేలియా జ‌ట్టు. పురుషుల‌, మ‌హిళ‌ల ఫార్మాట్ లో 339 ర‌న్స్ అత్య‌ధికంగా ఛేజింగ్. గ‌తంలో ఇంగ్లండ్ , దక్షిణాఫ్రికా జ‌ట్లు బ్రిస్బేన్ లో 678 ప‌రుగులు పూర్తి చేశారు. ఇదే టోర్నీలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 2017లో సెమీఫైనల్లో భారత్‌ను ఓడించిన తర్వాత 15 విజయాల తర్వాత వ‌న్డే ప్రపంచ కప్‌లో మొదటి ఓటమిని చవిచూసింది ఆసిస్.

Also Read : Jemimah Rodrigues Interesting Comments : ఆ జీస‌స్ కు రుణ‌ప‌డి ఉన్నా : జెమీమా

Exit mobile version