Jemimah Rodrigues Interesting Comments : ఆ జీస‌స్ కు రుణ‌ప‌డి ఉన్నా : జెమీమా

భార‌త జ‌ట్టును ఫైన‌ల్ కు చేర్చిన రోడ్రిగ్స్

Hello Telugu - Jemimah Rodrigues Interesting Comments

Hello Telugu - Jemimah Rodrigues Interesting Comments

Jemimah Rodrigues : ముంబై : అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించారు. అంతే కాదు రికార్డ్ స్థాయిలో భారీ ల‌క్ష్యాన్ని ఛేదించిన జ‌ట్టుగా అరుదైన చ‌రిత్ర సృష్టించారు. ముంబైలోని బీవై పాటిల్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ఏడుసార్లు విజేత‌గా నిలిచిన ఆసిస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. ఏకంగా 339 ప‌రుగుల‌ను 48.3 ఓవ‌ర్ల‌లోనే పూర్తి చేశారు మ‌న అమ్మాయిలు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్. జెమీమా (Jemimah Rodrigues) బాధ్యతాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకుంది.

Jemimah Rodrigues Comments

ఆట చివ‌రి దాకా జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చింది. త‌ను 134 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల‌తో 127 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. త‌న కెరీర్ లో ఇదే అత్యుత్త‌మ‌మైన ఇన్నింగ్స్. ఇక హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 88 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 89 ప‌రుగులు చేసింది. జెమీమా కౌర్ తో క‌లిసి 167 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. సెమీ ఫైన‌ల్ లో గెలుపొందిన అనంత‌రం సెంచ‌రీతో క‌దం తొక్కిన జెమీమా మీడియాతో మాట్లాడింది. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యింది. ఆ జీసస్ కు రుణ‌ప‌డి ఉన్నాన‌ని చెప్పంది. త‌న జీవితంలో మ‌రిచి పోలేని రోజుగా అభివ‌ర్ణించింది. తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ప్ర‌తి రోజూ ఏడ్చానంటూ పేర్కొంది. నా సెంచ‌రీ గురించి నేను ఆలోచించ‌డం లేదు. నా దేశాన్ని గెలిపించేందుకు నేను చేసిన ప్ర‌య‌త్నం ఇది. ఇంత‌కు మించి చెప్పేందుకు ఏమీ లేద‌ని పేర్కొంది. ఏసు క్రీస్తుకు, నా కోచ్ కు, న‌న్ను న‌మ్మిన ప్ర‌తి ఒక్క‌రికీ అంకితం చేస్తున్నాన‌ని చెప్పింది.

Also Read : Jemimah Rodrigues Sensational : జెమిమా రోడ్రిగ్స్ అదుర్స్

Exit mobile version