K Kavitha Shocking Comments : రాజీనామా చేశా క‌ట్టుబ‌డి ఉన్నా : క‌విత

ఏక‌ప‌క్ష నిర్ణ‌యం తీసుకుని బ‌య‌ట‌కు పంపారు

Hello Telugu - K Kavitha Shocking Comments

Hello Telugu - K Kavitha Shocking Comments

K Kavitha : నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పారు. సోమ‌వారం క‌విత (K Kavitha) మీడియాతో మాట్లాడారు. అంత‌కు ముందు ఆమె జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేద‌న్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ప‌రంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. అందరి తెలంగాణ కావాలే త‌ప్పా కొందరి తెలంగాణ కావొద్దు అనేది మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు క‌విత‌. అయితే భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారో తెలియ‌ద‌న్నారు. పార్టీ ఫిరాయింపు అనేది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

K Kavitha Key Comments

ఇదే స‌మ‌యంలో క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు త‌న తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీపై. త‌న అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండానే త‌న‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించి వేశార‌ని వాపోయారు. తాను తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందాన‌ని చెప్పారు. ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌ని తాను అనుకోలేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఆ పార్టీ నుంచి త‌న‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో త‌న‌ను నిజామాబాద్ జిల్లా ప్ర‌జ‌లు త‌న‌పై ప్రేమ‌తో ఆశీర్వ‌దించార‌ని, త‌న‌ను గెలిపించార‌ని చెప్పారు. ఇదే క్ర‌మంలో ఎమ్మెల్సీ గా ఛాన్స్ ఇచ్చార‌ని , కానీ త‌న‌పై వేటు వేయ‌డంతో గ‌త్యంత‌రం లేక తాను పార్టీ కి, ప‌ద‌వికి, ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : MLA Yennam Srinivas Reddy Fired on Govt : లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు?

Exit mobile version