రూ. 43 వేల కోట్ల ప్ర‌జా ధ‌నం జ‌గ‌న్ రెడ్డి లూటీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన వ‌ర్ల రామ‌య్య

hellotelugu-VarlaRamaiah

అమ‌రావ‌తి : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. త‌న తండ్రి, దివంగ‌త వైఎస్సార్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప‌ద‌విని అడ్డం పెట్టుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూ. 43 వేల కోట్ల ప్ర‌జా ధ‌నం లూటీ చేశాడ‌ని ఆరోపించారు. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇప్ప‌టికే ప‌లు కేసుల‌లో ఇరుక్కుని బ‌య‌ట‌కు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌న‌ను జ‌నం న‌మ్మే స్తితిలో లేర‌న్నారు. మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. అంతులేని అవినీతికి పాల్ప‌డిన జ‌గ‌న్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. కోర్టుల్లో కేసుల విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టేందుకు రంగం సిద్ధమైన ఈ తరుణంలో త‌ప్పించుకునేందుకు దారులు లేక ఏటీ కూట‌మి స‌ర్కార్ పై అభాండాలు వేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు వ‌ర్ల రామ‌య్య‌. తప్పు చేసినవాడు ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేడని అన్నారు. హిందీలో ఒక ప్రసిద్ధ సామెత ఉంది. “కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే హై” అంటే చట్టం చేతులు చాలా పొడవుగా ఉంటాయి. నువ్వు ఎంత దూరం పరిగెట్టినా, ఎంత కాలం దాక్కోవాలని చూసినా చట్టం చేయి వచ్చి నీ మెడను పట్టుకుంటుంది అని గుర్తు చేశారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా అదే పరిస్థితి ఎదురవుతోందని అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు.
సీబీఐ అరెస్ట్ చేసి, 11 ఛార్జ్ షీట్లు వేసి, ఇప్పుడు రోజువారి విచారణ జరుపుతుంటే మీదారెటూ జగన్? అని ప్ర‌శ్నించారు. ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఆధారాలతో సహా చెప్పింద‌న్నారు. రూ.43,000 కోట్ల అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, మిమ్మల్ని అరెస్టు చేసి, 16 నెలల పాటు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచింది సీబీఐ కాదా? సీబీఐ మీపై ఏకంగా 11 చార్జిషీట్లు దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ అవినీతి దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో 9 చార్జిషీట్లు వేసి, దాదాపు రూ.2,000 నుంచి రూ.3,000 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన సంగతి నిజం కాదా? అని నిప్పులు చెరిగారు. ఇంతకాలం రకరకాల వాయిదాలు కోరుతూ కాలయాపన చేసిన రోజులు ముగిశాయన్నారు. ఇప్పుడు న్యాయస్థానాలు ఈ కేసులన్నింటినీ రోజువారీ పద్ధతిలో విచారించడానికి సిద్ధపడుతున్నాయని అన్నారు వ‌ర్ల రామ‌య్య‌.

Exit mobile version