తాడేపల్లిగూడెం : ఏపీలో ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. కూటమి పార్టీల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు మొదటగా తమ పార్టీ తరపున మేయర్ అభ్యర్థులను ప్రకటించారు. విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి, విజయనగరం మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి, ఏలూరు మేయర్ అభ్యర్థిగా గంటా మోహన్రావును ఖరారు చేశారు. వీరితో పాటు మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతిస్థాన, విజయవాడ వైసీపీ మేయర్ అభ్యర్థిగా రాయని భాగ్యలక్ష్మి, ఒంగోలు మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్, నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్, కడప వైసీపీ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి, కర్నూలు మేయర్ అభ్యర్థిగా ఎం.సుశీల ను ప్రకటించారు జగన్ రెడ్డి.
ఇదిలా ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవులకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. పలాస మున్సిపల్ చైర్ పర్సన్ గా శ్రీపద్మ, నర్సీంపట్నం కు చింతకాయల అనిత, యలమంచిలి చైర్ పర్సన్ అభ్యర్థిగా బి. తులసి, తునికి రామ తులసి, కొవ్వూరుకు మన్నె పద్మ, రామచంద్రాపురంకు నాగేశ్వర్ రావు, ఇచ్చాపురంకు రాజ్యలక్ష్మి, కొండపల్లికి నల్లమోతు తేజస్విని ఎంపిక చేశారు జగన్ రెడ్డి. తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మద్దాలి శేషా చలం, చీరాలకకు ఇస్తర్ల షెర్లి, బద్వేల్ కు వెంకట సాయి కృష్ణ, పులివెందులకు వైఎస్ ప్రమీలమ్మ, మదనపల్లెకు జింకా చలపతి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నరసింహా రెడ్డిని ఖరారు చేశారు.
