MLA Yennam Srinivas Reddy Fired on Govt : లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు?

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఎమ్మెల్యే యెన్నం

Hello Telugu - MLA Yennam Srinivas Reddy Fired on Govt

Hello Telugu - MLA Yennam Srinivas Reddy Fired on Govt

Yennam Srinivas Reddy : పాల‌మూరు జిల్లా : కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న స‌భ్యుడు యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మ స్వంత ప్ర‌భుత్వంపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సోమ‌వారం ఆయ‌న ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ప్ర‌స్తుతం మా వ‌ద్ద ఒక్క పైసా కూడా లేదు. ఇక గ్రామాల‌కు ఎలా వెళ‌తామ‌ని ప్ర‌శ్నించారు. పెళ్లిళ్లు, శుభ కార్యాలు, చావుల‌కు త‌ప్పా స్వ‌యంగా వెళ్ల లేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ఈ ప‌రిస్థితి త‌న‌ది ఒక్క‌డిదే కాద‌ని ఇత‌ర ఎమ్మెల్యేల‌కు కూడా ఇలాంటి దుస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy). విచిత్రం ఏమిటంటే లక్ష, రెండు లక్షల పనులకు కూడా మా దగ్గర నిధులు లేవన్నారు. ఎమ్మెల్యేలుగా మా పరిస్థితి చెప్పు కోలేకుండా దారుణంగా ఉందంటూ వాపోయారు.

MLA Yennam Srinivas Reddy Slams Congress Govt

అయితే స‌ర్కార్ ల‌క్ష‌ల కోట్లు అప్పులు తీసుకు వ‌స్తోంది. డ‌బ్బులు ఎందుకు లేవంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. గ‌త కొంత కాలంగా త‌న‌తో పాటు జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి కూడా జ‌త క‌ట్టారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇంఛార్జి మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌తో క‌లిసి ఇటీవలే ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క‌లిసి వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఈ కామెంట్స్ చేయ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం ఎలా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోసం ఎలా వెళుతుంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది స‌ర్వ‌త్రా.

Also Read : Montha Cyclone Sensational in AP : క‌దిలిన మొంథా తుపాన్ ఏపీ ప‌రేషాన్

Exit mobile version